: ప్రపంచ కుబేరుల జాబితా టాప్-3లో భారత్


భారత్ వెలిగిపోతోంది! దేశంలో బిలియనీర్ల సంఖ్య నానాటికీ పెరుగుతున్నట్టు ప్రపంచ ఆర్థిక సంస్థల నివేదికలు, జాబితాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా, చైనాకు చెందిన హురూన్ మేగజైన్ విడుదల చేసిన జాబితాలో భారత్ టాప్-3లో చోటు సంపాదించింది. 97 మంది బిలియనీర్లతో భారత్ మూడోస్థానంలో నిలిచింది. తొలి రెండు స్థానాల్లో చైనా, అమెరికా ఉన్నాయి. 537 మంది కుబేరులతో చైనా అగ్రస్థానంలో ఉండగా, 430 మంది కుబేరులతో అమెరికా రెండో స్థానంలో ఉంది. కాగా, భారత్... రష్యాను వెనక్కినెట్టి మూడోస్థానానికి ఎగబాకింది. రష్యాలో 93 మంది బిలియనీర్లు ఉన్నట్టు 'హురూన్' పేర్కొంది. ప్రపంచంలో ఉన్న మొత్తం బిలియనీర్ల సంఖ్య 2089కి చేరిందని వివరించింది. ఇక, భారత్ లో రూ.1.2 లక్షల కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వి (రూ.1.02 లక్షల కోట్లు), టాటా సన్స్ (రూ.96,000 కోట్లు) నిలిచారు. రూ.6000 కోట్లు కనీస నెట్ వర్త్ ప్రాతిపదికన ఈ జాబితా రూపొందించారు.

  • Loading...

More Telugu News