: రెండొందల కోట్ల క్లబ్ లో శంకర్ 'ఐ'
భారీ బడ్జెట్ తో దర్శకుడు శంకర్ తెరకెక్కించిన తమిళ చిత్రం 'ఐ' రూ.200 కోట్ల క్లబ్ లో చేరింది. దాంతో ఈ దర్శకుడు గతంలో రూపొందించిన 'ఎందిరన్' (తెలుగులో 'రోబో') కలెక్షన్ రికార్డును రూ256 కోట్లు అధిగమించేందుకు సిద్ధమవుతోందట. నటుడు విక్రమ్, ఎమీ జాక్సన్ జంటగా చేసిన ఈ సినిమా దాదాపు తమిళనాడు, ఆంద్రప్రదేశ్ లోనే బాగా కలెక్షన్లు రాబట్టిందని సమాచారం. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో అమెరికా, మలేషియా,యూకె, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో కూడా ఈ సినిమా అసాధారణ విజయాన్ని సొంతం చేసుకుందట.