: పెళ్లి ట్రాక్టర్ బోల్తా... 24 మందికి గాయాలు: కర్నూలు సమీపంలో ప్రమాదం
కర్నూలు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్నూలు శివారులోని ఓర్వకల్లు మండలం ఉప్పలపాడు వద్ద నేటి ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో పెళ్లి బృందంతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 24 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు కర్నూలు సర్వజన వైద్యశాలకు తరలించారు. వెల్దుర్ది మండలం కృష్ణాపురం వాసులు ఓర్వకల్లు సమీపంలోని కాల్వబుగ్గ గుడిలో పెళ్లి వేడుకకు వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.