: వీవీఎస్ లక్ష్మణ్ కు గౌరవ డాక్టరేట్
భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ కు టెరి యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఢిల్లీలో వర్శిటీ ఏడవ స్నాతకోత్సవం సందర్భంగా లక్ష్మణ్ తో పాటు మరో ముగ్గురిని కూడా డాక్టరేట్ తో గౌరవించారు. ఈస్ట్ తైమూర్ మాజీ అధ్యక్షుడు జోస్ మాన్యుయేల్ రామోస్-హోర్టా, యూనిలీవర్ సీఈఓ పాల్ పోల్మన్, హిటాచీ చైర్మన్ హిరోకీ నకనిషి 'టెరి వర్శిటీ' డాక్టరేట్లు అందుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, చాలా సంతోషంగా ఉందన్నాడు. తాను డాక్టర్ ను కావాలనుకున్నానని, కానీ, క్రికెట్ లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్న కలను సాకారం చేసుకున్నానని వివరించాడు.