: కౌబాయ్ గా మంత్రి నారాయణ... తుళ్లూరులో గుర్రంపై స్వారీ!
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కేబినెట్ లో పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక సభ్యుడు. ప్రతి అంశంలోనూ ఆయన సలహా తప్పనిసరి. ఇక నవ్యాంధ్ర రాజధాని వ్యవహారం మొత్తం ఆయన కనుసన్నల్లోనే నడుస్తోంది. నవ్యాంధ్ర రాజధానిగా ఎంపికైన తుళ్లూరు పరిసరాల్లో నిత్యం పర్యటిస్తున్న మంత్రి నారాయణ నిన్న కౌబాయ్ అవతారం ఎత్తారు. తుళ్లూరు మండలం మల్కాపురంలో పర్యటించిన ఆయనను గుర్రమెక్కాల్సిందిగా గ్రామస్థులు కోరారు. గ్రామస్థుల కోరికను ఎందుకు కాదనాలి అనుకున్నారో, ఏమో... నారాయణ గుర్రం ఎక్కి, సరదాగా కొద్దిదూరం గుర్రంపై స్వారీ చేశారు.