: ప్రత్యేక ప్యాకేజీ సరిపోతుందా?: చంద్రబాబుతో మంత్రి నారాయణ, గంటా, పరకాల భేటీ


ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ లు కొద్దిసేపటి క్రితం సీఎం చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక అభివృద్దిపై చంద్రబాబు వారితో చర్చించినట్టు సమాచారం. అంతేకాక ప్రత్యేక ప్యాకేజీ కింద కేటాయించిన నిధుల మొత్తాన్ని, ఏఏ అంశాలకు కేటాయించాలన్న విషయంపైనా వారు చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ రావడం అసాధ్యమేనని ఇటీవల చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన కోసం కేంద్రం పరిగణనలోకి తీసుకున్న అంశాలపై చంద్రబాబు కాస్త లోతుగానే చర్చించారని విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News