: కొత్తపల్లి గీతకు హైకోర్టు నోటీసులు... కుల ధ్రువీకరణపై వివరాలివ్వాలని ఆదేశం


అరకు ఎంపీ కొత్తపల్లి గీత స్వైన్ ఫ్లూ నుంచి పూర్తిగా కోలుకుని నిన్న తన బర్త్ డే వేడుకలను సంతోషంగా జరుపుకున్నారు. అయితే హైకోర్టు జారీ చేసిన నోటీసులతో ఆమె ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది. కుల ధ్రువీకరణకు సంబంధించిన వ్యవహారంలో పూర్తి వివరాలను అందజేయాలని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం ఆమెకు నోటీసులు జారీ చేసింది. కొత్తపల్లి గీతతో పాటు ఏపీ గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎన్నికల కమిషన్ తదితరులకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. కొత్తపల్లి గీత ఎస్టీ కాదని, తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో ఆమె అరకు ఎంపీగా గెలిచారని ఏపీ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు కోర్టుకు ఫిర్యాదు చేశారు. తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించిన గీత సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు. ఈ పిటిషన్ ను బుధవారం హైకోర్టు ధర్మాసనం విచారించింది. తదుపరి విచారణను మార్చి 6కు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News