: బ్యాంకు మేనేజర్ కు ముష్టిఘాతాలు
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా మేనేజర్ ఖాతాదారులకు సమాచారం ఇవ్వకుండా బంగారం వేలం వేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంయమనం కోల్పోయిన ఖాతాదారులు బ్యాంకు మేనేజర్ పై ముష్టిఘాతాలు కురిపించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి, విచారిస్తామంటూ బ్యాంకు మేనేజర్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. దీంతో ఖాతాదారులు బ్యాంకు వద్ద రహదారిపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.