: మతసామరస్యానికి ప్రతీక...హిందూ దేవాలయానికి ముస్లిం విరాళం
దేశంలో లవ్ జీహాద్ అంటూ కొందరు, ఘర్ వాపసీ అంటూ మరికొందరు మతవిద్వేషాలు రేపుతుంటే, మతసామరస్యానికి ప్రతీకగా ఝార్ఖండ్ లోని ఓ ముస్లిం వ్యక్తి నిలిచారు. హిందూ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠకు భూరి విరాళమిచ్చి ఓ ముస్లిం దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు. 2010లో రామ్ ఘర్ లోని రాజ్ రప్ప దేవాలయాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో హజి రంజాన్ అలీ అనే వ్యక్తి దేవాలయంలో విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించాలని భావించారు. ఇందుకోసం ఆలయ నిర్వాహకులతో మాట్లాడి లక్షా యాభైవేల రూపాయలు విరాళంగా అందజేశారు. రంజాన్ అలీ కోల్ ఇండియాలో పని చేసి పదవీ విరమణ పొందారు.