: లోపల ఒవైసీ సభ, వెలుపల శివసేన ఆందోళన
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలకు నిరసనగా శివసేన కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. మహారాష్ట్ర, పూణేలోని కొంధ్వాలోని కౌసర్ బాగ్ లో ముస్లిం రిజర్వేషన్ల కోసం సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఆయన ప్రసంగిస్తున్నప్పుడు శివసేన కార్యకర్తలు సభా ప్రాంగణం బయట ఆందోళన నిర్వహించారు. ఆయన ప్రసంగం మత సామరస్యాన్ని దెబ్బతీసేలా, మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా ఉందని వారు ఆరోపించారు. కాగా, ఒవైసీ సభకు నిరాకరించిన పోలీసులు, షరతులతో అనుమతి మంజూరు చేశారు. సభకు 2 వేలకు మించి హాజరుకాకూడదని, నేతల ప్రసంగాలు ప్రత్యక్ష ప్రసారం చేయకూడదని షరతులు విధించారు.