: 'యోయో' హనీ సింగ్ ను నేను కొట్టలేదు: షారూఖ్ ఖాన్
బాలీవుడ్ పాప్ సింగర్ 'యోయో' హనీసింగ్ ను కొట్టలేదని షారుఖ్ ఖాన్ స్పష్టం చేశారు. హనీ సింగ్ పై చేయి చేసుకున్నట్టు మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొన్ని నెలలుగా హనీని కలవలేదని అన్నారు. అసలు ఎందుకిలాంటి పుకార్లు పుడతాయో అర్థం కావడం లేదని షారుఖ్ పేర్కొన్నాడు. 'మాటల్లోనే గుర్తు చేశారు, హనీకి అనారోగ్యంగా ఉందన్న సంగతి తెలిసింది. వెంటనే ఫోన్ చేయాలి' అంటూ వెళ్లిపోయారు. ఇలాంటి వివాదాలు షారూఖ్ కి కొత్తకాదు. గతంలో కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరాఖాన్ భర్త శిరీష్ కుందర్ పై చేయిచేసుకొని, వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. షారూఖ్ సూపర్ హిట్ సాంగ్ 'లుంగీ' డాన్స్ కు రూపకల్పన చేసింది 'యోయో' హనీసింగ్ కావడం విశేషం.