: సెల్ఫీ మోజుతోనే విమాన ప్రమాదం జరిగింది: ఎన్టీఎస్బీ


సెల్ఫీ మోజు ఓ విమాన ప్రమాదానికి, అందులో పైలట్, మరో వ్యక్తి మృతి చెందడానికి కారణమైంది. అమెరికా జాతీయ రవాణా భద్రతా సంస్థ (ఎన్ టీఎస్ బీ) తెలిపిన వివరాల ప్రకారం, గత ఏడాది మే నెలలో రెండు చిన్న సీట్ల విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో విమానంలోని పైలట్ తో పాటు మరో వ్యక్తి మృతి చెందారు. దీనిపై ఎన్ టీఎస్ బీ విచారణ చేపట్టింది. ఈ విచారణలో ఆసక్తికరమైన అంశం వెలుగు చూసింది. కాక్ పిట్ లో రికార్డైన వీడియోలో పైలట్ తన సెల్ ఫోన్ లో సెల్ఫీలు దిగుతుండగా విమానం ప్రమాదానికి గురైనట్టు ఎన్ టీఎస్ బీ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News