: తన కూతురికి జరిగింది మరెవరికీ జరగకూడదంటూ కేంద్ర మంత్రికి లేఖ


"నన్ను నేను రక్షించుకునేందుకు నాకు ఎలాంటి అద్భుత శక్తులూ అవసరం లేదు. ఎందుకంటే మా నాన్న ఉన్నాడు. ఆయన ఉండగా నాకు భయమెందుకు?" అంటూ కోట్ చేసిన గ్రీటింగ్ కార్డును కమలికా దాస్ అనే 17 ఏళ్ల కోల్ కతా యువతి ఫాదర్స్ డే రోజున తన తండ్రికి అందజేసింది. దానిని అందుకున్న ఆ తండ్రి ఎంతో ఉప్పొంగిపోయాడు. అంతటి అద్భుతమైన రీతిలో సందేశాన్నిచ్చిన కుమార్తెను కాపాడుకోలేకపోయాను, నా కుమార్తె చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ యువతి తండ్రి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి లేఖరాశాడు. వివరాల్లోకి వెళితే... కమలికా దాస్ అనే యువతి కోల్ కతాలోని కేంద్రీయ విద్యాలయలో చదువుతోంది. నాలుగేళ్ల కిందట అదే స్కూల్ లో చదువుతున్న సహవిద్యార్థి కమలికను లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. దీంతో, బాలిక సదరు విద్యార్థిపై స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. దీంతో యాజమాన్యం బాలుడిని స్కూలు నుంచి పంపించేసింది. లైంగిక వేధింపులు ఆగినప్పటికీ టీచర్లు, ప్రిన్సిపల్ తదితరుల వేధింపులు మొదలయ్యాయి. బాలుడిపై నిరాధారమైన ఫిర్యాదు చేసి, స్కూల్ కు చెడ్డపేరు తెస్తున్నావంటూ మండిపడడం ప్రారంభించారు. హోం వర్క్ సరిగా చేయడం లేదని స్కూలు నుంచి పంపేస్తామని బెదిరించారు. దీంతో, తన స్కూలు డైరీ పేజీలో ప్రిన్సిపాల్ కి వీడ్కోలు సందేశం రాసిన కమలిక, జనవరి 19న తాము నివసిస్తున్న భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో తన కుమార్తె మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కమలిక తండ్రి పోలీసులను ఆశ్రయించారు. న్యాయం చేయాలంటూ కేంద్ర మంత్రికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

  • Loading...

More Telugu News