: ధోనీ వరల్డ్ కప్ మీడియా సమావేశం 7న


వరల్డ్ కప్ దగ్గరపడుతోంది. ఇప్పటి వరకు మేనేజ్ మెంట్లు కానీ, జట్టు కెప్టెన్లు కానీ వ్యూహాలు, ఆలోచనలపై మాట్లాడలేదు. ప్రతి టోర్నీకి ముందు జట్ల కెప్టెన్లు మీడియా సమావేశం నిర్వహించడం సంప్రదాయం. దీంతో వరల్డ్ కప్ సన్నాహాలపై ఐసీసీ ఏసీఎస్ యూ ఛైర్మన్ రోనీ ఫ్లానగాన్ ఫిబ్రవరి 6న మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వరల్డ్ కప్ జట్ల కెప్టెన్లు కూడా పాలుపంచుకునే అవకాశం ఉంది. దీనిని సిడ్నీలోని ఇంటర్నేషనల్ హోటల్ లో నిర్వహించనున్నారు. అనంతరం ఫిబ్రవరి 7న జరిగే మీడియా సమావేశంలో టీమిండియా కెప్టెన్ ధోనీతో పాటు శిఖర్ ధావన్, సురేష్ రైనా, రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ కూడా పాల్గొంటారు. ఇతర దేశాల కెప్టెన్లు కూడా అదే రోజు మీడియా సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News