: ఢిల్లీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ కు అవకాశం లేదు: ఈసీ


ఢిల్లీ ఎన్నికలకు వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లను ట్యాంపరింగ్ చేసేందుకు ఏమాత్రం అవకాశం లేదని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు ఈవీఎంల ట్యాంపరింగ్ కు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ 'ఆప్' నేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను ఈసీ తిరస్కరించింది. ఈరోజు తమను కలసిన కేజ్రీకి ఈవీఎంల పనితీరును గురించి వివరించినట్టు అధికారులు తెలిపారు. కేజ్రీవాల్ సందేహాలన్నింటినీ నివృత్తి చేసినట్టు ఈసీ వర్గాలు చెప్పాయి. ట్యాంపరింగ్ జరిగే అవకాశముందని కేజ్రీ చెబుతున్న ఈవీఎంలు 2006కు ముందు బ్యాచ్ కు చెందినవని, వాటిల్లోనూ ట్యాంపరింగ్ అవకాశం తక్కువని వెల్లడించారు.

  • Loading...

More Telugu News