: గాంధీ ఆసుపత్రిలో వైద్యులను చితకబాదేశారు


రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రోజూ వార్తల్లో నిలిచే ఆసుపత్రి ఏదైనా ఉందంటే... బహుశా అది హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రే అయి ఉంటుంది. ఇప్పటికే స్వైన్ ఫ్లూతో ప్రతి రోజూ పతాక శీర్షికలకు ఎక్కుతున్న గాంధీ ఆసుపత్రి తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. గాంధీ ఆసుపత్రి వైద్యులపై దాడి చేసిన కొంతమంది... వారిని చితకబాదేశారు. వివరాల్లోకి వెళ్లే, గాంధీలో చికిత్స పొందుతూ పద్నాలుగేళ్ల ఓ బాలుడు మరణించాడు. బాలుడి మృతికి వైద్యులే కారణమని ఆగ్రహంచిన బంధువులు వైద్యులపై దాడి చేశారు. దీంతో, వైద్యులు, సిబ్బంది ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును ప్రారంభించారు.

  • Loading...

More Telugu News