: జయంతి నటరాజన్ వ్యాఖ్యలకు భయపడటం లేదు: రాహుల్ గాంధీ
ఇటీవల కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జయంతి నటరాజన్ పోతూ పోతూ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకు రాహుల్ స్పందించారు. జయంతి వ్యాఖ్యలకు తాను భయపడటంలేదన్నారు. తాను పేద ప్రజలకోసం ఉన్నానని, పారిశ్రామికవేత్తల కోసం కాదని చెప్పారు. పర్యావరణ శాఖ మంత్రిగా తానున్నప్పుడు రాహుల్ కొన్ని విషయాల్లో జోక్యం చేసుకున్నారని, తనను శాఖ నుంచి తొలగించేముందు చెప్పలేదని నటరాజన్ ఆరోపించిన విషయం విదితమే.