: నేనెలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టలేదు: ప్రకృతి వైద్యుడు మంతెన సత్యనారాయణ రాజు
ప్రకృతి వైద్యుడిగా, పలు టీవీ కార్యక్రమాల ద్వారా ప్రజలకు సుపరిచితుడైన మంతెన సత్యనారాయణ రాజు కృష్ణా నదీ తీరాన అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఆయన... తాను ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టలేదని... గోకరాజు గంగరాజు తనకు నాలుగు ఎకరాల స్థలం ఇచ్చారని, ఆ స్థలంలోనే నిర్మాణాలు చేపట్టానని చెప్పారు. భవన నిర్మాణాల కోసం నీటిపారుదల శాఖ నోఅబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చిందని, ఐదు అంతస్తుల బిల్డింగ్ కట్టుకోవడానికి విజయవాడ, గుంటూరు అభివృద్ధి సంస్థ అనుమతి ఇచ్చిందని తెలిపారు. వీటి కోసం తాను రూ. 26 లక్షల ఫీజు కూడా చెల్లించానని చెప్పారు. విద్య, వైద్య సేవలకు సంబంధించిన భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వచ్చని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని మంతెన తెలిపారు.