: టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రారంభం... తొలి సభ్యత్వం కవితదే


సభ్యత్వ నమోదు కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) శ్రీకారం చుట్టింది. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో ప్రారంభమైన సభ్యత్వ నమోదు ప్రక్రియలో తొలి సభ్యత్వాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత తీసుకున్నారు. ఇటీవల టీడీపీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేపట్టిన సభ్యత్వ నమోదుకు ఆశించిన మేర స్పందన రాలేదు. అదే సమయంలో బీజేపీ సభ్యత్వ నమోదు కూడా అంతంతమాత్రంగానే జరిగినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు భారీ స్పందన లభించడం ఖాయమేనన్న విశ్లేషణలు సాగుతున్నాయి. అంతేగాక, చాలా రోజుల తర్వాత పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సీఎం కేసీఆర్ నిన్న చేసిన ప్రసంగం కూడా సభ్యత్వ నమోదుకు మంచి ఊపునివ్వనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News