: 'ఆప్' విదేశీ నిధులపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తున్న విదేశీ నిధులపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పార్టీకి వచ్చిన గత, ప్రస్తుత నిధులపై సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు. నాలుగురోజుల కిందట 'ఆప్' నిధులపై 'ఆప్ వాలంటరీ యాక్షన్ మంచ్' తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నిధుల విషయంలో కుంభకోణం జరిగిందని, వచ్చింది నల్లడబ్బేనని ఆరోపించింది. అటు, బీజేపీ ఏకంగా ఓ కార్టూన్ ప్రకటన కూడా ఇచ్చింది. కానీ, వాటన్నింటినీ 'ఆప్' నేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. కావాలంటే దర్యాప్తు చేయించుకోవచ్చని కూడా అన్నారు.