: తెలంగాణ వర్శిటీ విద్యార్థినుల చేతిలో తన్నులు తిన్న వ్యక్తులు పోలీసులట!
నిజామాబాదులోని తెలంగాణ యూనివర్శిటీ లేడీస్ హాస్టల్ లోకి చొరబడేందుకు యత్నించి పట్టుబడ్డ ముగ్గురు నిందితుల్లో ఇద్దరు పోలీసులని తేలింది. వీరిలో మరోవ్యక్తిని ఓ పోలీసు అధికారి కుటుంబానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. సోమవారం సాయంత్రం వర్శిటీలోని లేడీస్ హాస్టల్ లోకి చొరబడ్డ ముగ్గురు యువకుల ఉదంతం కలకలం రేపింది. హాస్టల్ లోకి ప్రవేశించిన ఈ ముగ్గురు యువకులను చితకబాదిన విద్యార్థినులు పోలీసులకు అప్పగించారు. నిందితులను విచారించిన పోలీసులు, వారిలో ఇద్దరిని తెలంగాణ స్పెషల్ పోలీసు విభాగంలో కానిస్టేబుళ్లుగా గుర్తించారు. మరోవ్యక్తి పోలీసు అధికారి కుమారుడని తేలింది. విచారణ సందర్భంగా, లేడీస్ హాస్టల్ లోకి ఎందుకు చొరబడ్డారంటూ ప్రశ్నించగా, వారు పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం.