: జేఎన్ఎన్ యుఆర్ఎం పథకానికి వాజ్ పేయి పేరు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లో యూపీఏ హయాంలోని పథకాలను రద్దు చేయడం, పేర్లు మార్చడం తెలిసిందే. ఇందులో ప్రధానంగా నెహ్రూ-గాంధీ కుటుంబీకుల పేర్లతో ఉన్న పథకాల పేర్లు మార్పు జరిగింది. తాజాగా జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ (జేఎన్ఎన్ యుఆర్ఎం) పథకం పేరును మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి పేరు మీదగా 'అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ ఫార్మేషన్'గా మార్చాలనుకుంటోంది. ఇక, ప్లానింగ్ కమిషన్ ను రద్దు చేసిన కేంద్రం దాని స్థానంలో 'నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా (ఎన్ఐటీఐ) అయోగ్' పేరిట కొత్త సంస్థను తీసుకొచ్చిన విషయం విదితమే.