: తిరుపతి బరిలోకి లోకేష్ ను దించాలనుకున్నారు: రఘువీరా వింత వాదన


ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కొత్త విషయాన్ని వెల్లడించారు. తిరుపతి శాసనసభ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నిక బరిలోకి తన కుమారుడు లోకేష్ ను దింపాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావించారని ఆరోపించారు. అయితే, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో వెనకడుగు వేశారని తెలిపారు. చివరకు, సిట్టింగ్ ఎమ్మెల్యే దివంగత వెంకటరమణ భార్య సుగుణమ్మను బరిలోకి దింపితే, సానుభూతితో గెలుస్తారనే ఉద్దేశంతో ఆమెకు సీటు ఇచ్చారని చెప్పారు. ఏ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా చనిపోయినప్పుడు, వారి కుటుంబ సభ్యులెవరైనా ఎన్నికల బరిలోకి దిగితే, వారిపై పోటీ పెట్టరాదనే నియమాన్ని రాష్ట్రంలోని అన్ని పార్టీలు పాటిస్తున్న సంగతి తెలిసిందే. అసలు ఈ నిబంధనకు నాంది పలికింది టీడీపీనే. అలాంటిది, ఈ నిబంధనకు తూట్లు పొడుస్తూ, లోకేష్ ను ఎన్నికల బరిలోకి దింపాలని చంద్రబాబు ఎలా ఆలోచించారన్న విషయం రఘువీరాకే తెలవాలి.

  • Loading...

More Telugu News