: తెలివిమీరిన దొంగలు... బంగారంతో పాటు సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ ను పట్టుకెళ్లారు!


హైదరాబాదు శివారు ప్రాంతం బీరంగూడలో కొద్దిసేపటి క్రితం దొంగలు హల్ చల్ చేశారు. బీరంగూడలోని ముత్తూట్ గోల్డ్ లోన్ శాఖలో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. కస్టమర్లలా శాఖలోకి చొరబడ్డ దొంగలు సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేసి లాకర్ రూంలో బంధించారు. ఆ తర్వాత నింపాదిగా తమ పని కానిచ్చేశారు. స్ట్రాంగ్ రూంలో ఉన్న 5 కిలోల బంగారాన్ని సంచుల్లో నింపుకున్న దొంగలు పోలీసులకు ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డారు. సీసీ కెమెరాలను, సదరు కెమెరాలు చిత్రీకరించిన వీడియో ఫుటేజీలను భద్రం చేసే హార్డ్ డిస్క్ ను కూడా సంచిలో వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఘటనపై సమాచారం అందుకున్న మెదక్ జిల్లా పోలీసులు చోరుల కోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News