: ఉగ్రవాదులందరినీ చంపండి... జోర్డాన్ రాజుకు ప్రజల డిమాండ్
తమ దేశ పైలెట్ ను అత్యంత దారుణంగా సజీవ దహనం చేసిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవాలని జోర్డాన్ ప్రజలు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. పైలెట్ సజీవదహనం చిత్రాలు ఈ ఉదయం దినపత్రికల్లో చూసిన ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. జైలులో బందీలుగా ఉన్న ఇద్దరిని హతమారిస్తే సరిపోదని, ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ తక్షణం మరణదండన అమలు చేయాలని జోర్డాన్ రాజును ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తమ వద్ద బందీగా ఉన్న జోర్డాన్ పైలెట్ ను హత్య చేయగా, ఆ వెంటనే జోర్డాన్ ఇద్దరు ఉగ్రవాదులకు మరణ శిక్ష అమలుచేసిన సంగతి తెలిసిందే.