: తైపీ విమాన ప్రమాదంలో 9 మంది మృతి


తైవాన్ రాజధాని తైపీ శివారులోని ఓ నదిలో ట్రాన్స్ ఏషియా విమానం కూలిన ఘటనలో ఇప్పటివరకు 9 మంది మరణించినట్టు అధికారులు ప్రకటించారు. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు, సహాయక సిబ్బంది 17 మంది ప్రయాణికుల్ని రక్షించారు. గల్లంతైన వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు, ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విమానం తైపీ నుంచి కిన్మెన్ ద్వీపానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

  • Loading...

More Telugu News