: స్కూళ్లలో సూర్య నమస్కారం తప్పనిసరి చేసిన రాజస్థాన్
రాజస్థాన్ సర్కారు అక్కడి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సూర్య నమస్కారం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 48000 పాఠశాలల్లో కచ్చితంగా సూర్య నమస్కారం చేయాల్సిందేనని ఉత్తర్వులు జారీచేసింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఇటీవల మధ్యప్రదేశ్ సర్కారు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. దానిపై విమర్శలు కూడా వచ్చాయి. విద్యను కాషాయీకరణ చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఇక, రాజస్థాన్ విషయానికొస్తే, సూర్య నమస్కారం కారణంగా విద్యార్థుల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగవుతుందని సర్కారు తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది. అయితే, కొన్ని పౌర సంఘాలు మాత్రం ప్రభుత్వ తీరును నిరసించాయి.