: ఏపీ వ్యాప్తంగా రవాణా శాఖ అధికారుల దాడులు... పలు బస్సుల సీజ్


ఆంధ్రప్రదేశ్ లో మరోసారి రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ ఉదయం నుంచి అధికారులు పలు ప్రవేటు బస్సుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 40 పాఠశాల బస్సులను సీజ్ చేశారు. సదరు బస్సుల యాజమాన్యాలకు నోటీసులు పంపారు. అందులో కృష్ణాజిల్లా 9, గుంటూరు 8, తూర్పుగోదావరి జిల్లాలో 14, పశ్చిమగోదావరి జిల్లాలో 4, విశాఖపట్నం 2, కర్నూలు జిల్లాలో 3 పాఠశాల బస్సులను సీజ్ చేసినట్టు ఆర్టీఏ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News