: ప్రధాని మోదీకి లేఖ రాసిన కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్య పరిష్కారానికి తక్షణం స్పందించి చర్యలు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. ఈ లేఖ ప్రతిని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కి కూడా పంపారు. తూర్పు గ్రిడ్‌లో అందుబాటులో వున్న మిగులు విద్యుత్ ను తెలంగాణా రాష్ట్రానికి కేటాయించాలని ఈ లేఖలో కేసీఆర్ కోరారు. కనీసం 500 మెగావాట్ల విద్యుత్ కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేసీఆర్ కోరారు.