: పంజాగుట్టలో రోడ్లపై పైరసీ సీడీల కుప్పలు... పోలీసుల అదుపులో ఇద్దరు


హైదరాబాదులోని పంజాగుట్టలో పైరసీ సీడీలను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వీరి నుంచి 1414 సీడీలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మెరిడియన్ హోటల్ వద్ద రాజేందర్ (57), అహ్మద్ (28)లు పైరసీ సీడీలను రోడ్డుపై కుప్పగా పోసి అమ్ముతుండగా అదుపులోకి తీసుకున్నారు. వీటిల్లో ఇటీవలే విడుదలైన సినిమాలు అనేకం వున్నాయి. వీరిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. వీరికి సీడీలు ఎక్కడినుంచి వచ్చాయన్న విషయంపై దృష్టిని సారించామని తెలియజేశారు.

  • Loading...

More Telugu News