: తైవాన్ లోని తైపే నదిలో కూలిన ట్రాన్స్ ఏషియా విమానం!
మరో విమాన ప్రమాదం జరిగింది. తైవాన్ రాజధాని తైపేకి 58 మంది ప్రయాణికులు, సిబ్బందితో వస్తున్న ట్రాన్స్ ఏషియా ఏటీఆర్ 72-600 టర్బోప్రాప్ విమానం తైపే నదిలో కూలింది. అంతకుముందు ఈ విమానం ఒక బ్రిడ్జిని ఢీ కొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్టు స్థానిక మీడియా వివరించింది. నగరానికి దగ్గరలో ప్రమాదం జరగడంతో సహాయక సిబ్బంది వెంటనే స్పందించారు. 10 మంది ప్రయాణికులను కాపాడినట్టు తెలుస్తోంది. మిగతా వారంతా విమానంలో చిక్కుకుపోయి ఉన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.