: 'ఛలో సీఎం ఆఫీస్' బాటలో కుప్పం రైతులు... ఏనుగుల దాడులను నివారించాలని వినతి
ఆ రైతులు సాక్షాత్తు సీఎం నారా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గానికి చెందినవారు. అయినా, నిత్యం గజరాజుల భయంతో క్షణమొక యుగంలా కాలం వెళ్లదీస్తున్నారు. ఇదీ కుప్పం నియోజకవర్గంలోని పలు గ్రామాల దుస్థితి. తాజాగా నేటి ఉదయం కుప్పం పరిధిలోని రామకుప్పం మండలం ననియాలా, పెద్దూరుల్లో గజరాజుల ప్రవేశంతో భయాందోళనలు నెలకొన్నాయి. తమపై దాడి చేసేందుకు యత్నించిన గజరాజుల నుంచి ఆ గ్రామాల రైతులు తృటిలో తప్పించుకున్నారు. ఏనుగుల దాడులను నివారించాలని పలుమార్లు చేసిన విజ్ఞప్తికి స్పందన లభించలేదన్న ఆగ్రహంతో ఏకంగా సీఎంను కలుద్దామని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ‘ఛలో సీఎం కార్యాలయం’ పిలుపునిచ్చారు. మరి చంద్రబాబు... వారిని కుప్పంలో కలుస్తారో, లేక హైదరాబాదులో భేటీ అవుతారో చూడాలి.