: ప్రజల అభీష్టం మేరకే నవ్యాంధ్ర రాజధాని...త్వరలో ఆన్ లైన్ లో ‘మాస్టర్ ప్లాన్’
ప్రజల అభీష్టం మేరకే నవ్యాంధ్ర రాజధానిని నిర్మించనున్నట్లు ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. కొత్త రాజధానికి సంబంధించి నిన్న సీఎం చంద్రబాబునాయుడితో భేటీ అయిన సింగపూర్ ప్రతినిధి బృందం, మాస్టర్ ప్లాన్ కు సంబంధించి రెండు, మూడు ప్రతిపాదనలు అందజేసిందని ఆయన చెప్పారు. వీటిని పరిశీలిస్తున్నామని, మరో రెండు, మూడు రోజుల్లోగా ఆన్ లైన్ లో పెడతామని అన్నారు. మాస్టర్ ప్లాన్ పై ప్రజల సలహాలు, సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.