: ధోనీ, ఇషాంత్ చేపల వేటకు...కుటుంబంతో ధావన్, బిన్నీ
టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ వారం రోజులు హాలీడే ప్రకటించింది. దీంతో ఆటగాళ్లు ఎవరి స్థాయిలో వాళ్లు ప్రణాళికలు రచించుకున్నారు. కొంత మంది విహార యాత్రలకు వెళ్తుండగా, మరి కొందరు భార్యాపిల్లలు, తల్లిదండ్రులతో గడిపేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. టీమిండియా కెప్టెన్ ధోనీ, సహచరుడు ఇషాంత్ శర్మతో కలిసి చేపల వేట, సాహస క్రీడలు (ట్రెక్కింగ్), బోటింగ్ కు వెళ్లనున్నాడు. ఈ మేరకు కొంత మంది మిత్రులతో ప్రణాళికలు రచించాడు. మిగిలిన రోజులన్నీ విశ్రాంతి తీసుకోనున్నాడు. స్టూవర్ట్ బిన్నీ తన సోదరితో గడిపేందుకు ఆమె ఇంటికి వెళ్లనున్నాడు. శిఖర్ ధావన్ త భార్య, పిల్లలతో గడపనున్నాడని అధికారులు వెల్లడించారు.