: 'బాహుబలి' కథ ముగిసింది...'రుద్రమదేవి'ది ప్రారంభమైంది


తెలుగు సినీ పరిశ్రమకు మరోషాక్ తగలింది. తెలుగు సినీ పరిశ్రమను పైరసీ భూతం పట్టిపీడిస్తోంది. దానికి తోడు లీకు వీరులు పెరిగిపోతున్నారు. సినిమా పోస్టు ప్రొడక్షన్ దశలో కొన్ని దృశ్యాలు లీకవుతూ దర్శక, నిర్మాతలకు కన్నీళ్లు మిగులుస్తున్నాయి. 'బాహుబలి' సినిమాలోని కొన్ని సీన్లు లీకయ్యాయని ఆ సినిమా దర్శకుడు రాజమౌళి సీసీఎస్ పోలీసులను ఆశ్రయించిన ఉదంతం మరువకముందే, ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమవుతున్న 'రుద్రమదేవి' సినిమాలోని ఆడియో లీకైందంటూ వార్తలు వెలువడుతున్నాయి. 'రుద్రమదేవి' ఆడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఆడియో ఎలా బయటికి లీకైందో తెలుసుకునే పనిలో సినిమా యూనిట్ పడినట్టు తెలుస్తోంది. 'రుద్రమదేవి'లో అనుష్క, దగ్గుబాటి రానా, అల్లు అర్జున్, కృష్ణంరాజు, నిత్యామీనన్, ప్రకాశ్ రాజ్ తదితరులు నటించారు.

  • Loading...

More Telugu News