: నేను చాలా శక్తిమంతుడిని...మోదీని పడగొట్టగల సామర్థ్యముంది:సాక్షి మహారాజ్


రాజకీయ నేతగా మారిన సాధువు సాక్షి మహారాజ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. కుటుంబ నియంత్రణను పక్కనపెట్టి ఒక్కో హిందువు నలుగురు పిల్లలను కనాలంటూ వివాదం రేపిన ఆయన, ఈసారి వ్యాఖ్యల్లో ప్రధానినే లక్ష్యం చేసుకున్నారు. తాను చాలా శక్తిమంతుడినని పేర్కొన్న సాక్షి మహరాజ్, తనకు మోదీ ప్రభుత్వాన్ని కూల్చగల లేదా, నిలబెట్టగల సత్తా ఉందని అన్నారు. అనుభవజ్ఞుడైన సరంగు పడవని నడిపినట్టు మోదీ దేశాన్ని నడపాలని సూచించారు. ఓ తెడ్డుతో దేశ ఆర్థిక వ్యవస్థని, మరో తెడ్డుతో హిందూ అజెండాని గాడిన పెట్టాలని ఆయన ప్రధానికి హితబోధ చేశారు.

  • Loading...

More Telugu News