: ఢిల్లీ ప్రజల బాధలు తీర్చడం నా బాధ్యత: మోదీ


ఢిల్లీ ప్రజల బాధలు తీర్చడం తన బాధ్యతని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీ ప్రజలు చూపిన ఆదరణ మరువలేనని అన్నారు. ఢిల్లీ ప్రజల బాధ్యత తన భుజస్కంధాలపై ఉందని మోదీ తెలిపారు. 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఢిల్లీ పరిస్థితి దుర్భరంగా తయారైందని ఆయన పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల సమయంలో తనపై అనేక ఆరోపణలు చేశారని, గుజరాత్ వెలుపల మోదీని ఎవరు గుర్తిస్తారని విమర్శించారని ఆయన గుర్తు చేసుకున్నారు. రాజధాని కీర్తిని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాల్సిన అవసరముందని, ఢిల్లీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపుతామని ఆయన హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News