: అతడు బలైపోయినా.... ట్వీట్ మాత్రం హల్ చల్ చేస్తోంది!
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ సిిరియా అండ్ ఇరాక్ (ఐఎస్ఐఎస్) గ్రూపు కర్కశత్వానికి బలైపోయిన వారిలో కెంజి గోటో ఒకరు. ఈ జపాన్ జర్నలిస్టు పీక కోసిన ఐఎస్ఐఎస్ దాని తాలూకు వీడియోను విడుదల చేసింది కూడా. ఈ ఘటనపై జపాన్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనవగా, అంతర్జాతీయ సమాజం విచారం వ్యక్తం చేసింది. కాగా, కెంజి గోటో మరణానంతరం ఓ ట్వీట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గోటో నాలుగేళ్ల కిందట ఈ ట్వీట్ చేశాడు. "కళ్లు మూసుకుని సహనం పాటించండి. ఇది దాదాపు ప్రార్థించడం వంటిదే. ద్వేష భావం మనుషులకు సంబంధించినది కాదు. ఏ నిర్ణయమైనా దేవుడిదే" అని ఆగ్రహావేశాల నియంత్రణపై తన సలహాను ట్విట్టర్లో పేర్కొన్నాడు. తనకు ఆ ధ్యానాన్ని అరబ్ సోదరులు నేర్పారని వివరించాడు. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందుతోంది. నేటికి ఆ ట్వీట్ ను 26,000 సార్లు రీట్వీట్ చేశారట.