: ఐఎస్ఐఎస్ పై పోరాటానికి చేయి కలపండి: న్యూజిలాండ్ ను కోరిన బ్రిటన్
ఇరాక్, సిరియాల్లో మారణహోమం సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను అంతమొందించడానికి పోరాడుతున్న కూటమితో కలసిరావాలని న్యూజిలాండ్ ను బ్రిటన్ కోరింది. ఇస్లామిక్ ఉగ్రవాదులతో పోరాడుతున్న కూటమిలో న్యూజిలాండ్ కూడా చేరుతుందనే ఆశాభావాన్ని బ్రిటన్ విదేశాంగ మంత్రి ఫిలిప్ హమాండ్ వ్యక్తం చేశారు. ఉగ్రవాదులపై పోరులో ఒక్కో దేశం ఒక్కో విధానాన్ని అనుసరిస్తోందని... న్యూజిలాండ్ కూడా తనదైన సొంత పంథాలో దూసుకుపోవచ్చని చెప్పారు. న్యూజిలాండ్ లో పర్యటిస్తున్న ఫిలిప్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.