: ఆరు నెలల తరువాత ఫిడెల్ క్యాస్ట్రో ఫొటోల ప్రచురణ
దాదాపు ఆరు నెలల తరువాత క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో (88) ఫోటోలను ఆ దేశ పత్రికలు ప్రచురించాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందంటూ పుకార్లు రావడంతో ఆ దేశ ప్రభుత్వ మీడియా ఫోటోలను విడుదల చేసింది. ఫొటోల్లో తన బార్య డాలియాతో కలసి ఉన్న క్యాస్ట్రో ఓ విద్యార్థి నాయకునితో మాట్లాడుతున్నట్టుగా ఉంది. జనవరి 23న ఈ ఫొటోలను తీసినట్టు తెలిసింది. గతేడాది జనవరిలో క్యాస్ట్రో చివరిసారిగా జనాలకు కనిపించారు. తీవ్ర అనారోగ్య పరిస్థితుల కారణంగా 2006లో ఆయన అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి విదితమే.