: చంద్రబాబు వల్లే కరెంటు కష్టాలు: కేసీఆర్


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపణాస్త్రాలు సంధించారు. తెలంగాణలో నెలకొన్న విద్యుత్ సంక్షోభానికి కేవలం చంద్రబాబు నాయుడే కారణమని చెప్పారు. న్యాయబద్ధంగా తమకు రావాల్సిన విద్యుత్ వాటాను చంద్రబాబు ఇవ్వడం లేదని... అందుకే కరెంట్ కష్టాలు వచ్చాయని ఆరోపించారు. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఈ వేసవిలో కరెంట్ సమస్యలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మూడేళ్ల తర్వాత క్షణకాలం కూడా కరెంట్ పోదని చెప్పారు. ఎన్టీపీసీ ద్వారా 4 వేల మెగావాట్లు, జెన్ కో ద్వారా 6 వేల మెగావాట్ల విద్యుత్ సాధిస్తామని వెల్లడించారు. కొంపల్లిలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగిస్తూ, కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News