: రాజస్థాన్ హోంమంత్రికి స్వైన్ ఫ్లూ
స్వైన్ ఫ్లూ వైరస్ దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం దీని బారిన పడి ఆసుపత్రి మంచాలను ఆశ్రయిస్తున్నారు. తాజాగా, రాజస్థాన్ హోంమంత్రి గులాబ్ చంద్ కటారియాకు స్వైన్ ఫ్లూ వైరస్ సోకింది. ఆయన తన సొంత ఊరు ఉదయ్ పూర్ లో ఓ వివాహానికి వెళ్లి వచ్చాక, ఆరోగ్యం బాగోలేకపోవడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు హెచ్1 ఎన్1 వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇప్పటికే రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు స్వైన్ ఫ్లూ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటివరకూ రాజస్థాన్ లో స్వైన్ ఫ్లూతో మరణించిన వారి సంఖ్య 49కి చేరింది.