: సిడ్నీలో సచిన్ మైనపు ప్రతిమ


భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు అరుదైన గౌరవం దక్కనుంది. సిడ్నీలో.. విఖ్యాత బ్యాట్స్ మన్ సర్ డొనాల్డ్ బ్రాడ్ మన్ విగ్రహం సరసన సచిన్ ప్రతిమను కూడా ఉంచాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. వచ్చే బుధవారం సచిన్ 40వ పడిలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ఉన్న సచిన్ మైనపు ప్రతిమకు నకలును సిడ్నీ తీసుకువస్తారు.

ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వెలుపల డాన్ బ్రాడ్ మన్, లెజెండరీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ విగ్రహాల సరసన సచిన్ ప్రతిమను రేపు ఆవిష్కరిస్తారు. అనంతరం ఆ ప్రతిమను ఇక్కడి సీనిక్ డార్లింగ్ హార్బర్ వద్ద గల మ్యూజియంలో సందర్శనకు ఉంచుతారు. ఈ విషయమై సచిన్ స్పందించాడు. తనను బ్రాడ్ మన్ సరసన నిలిపే ఏ విషయమైనా సంతోషదాయకమేనని వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News