: యువీ వరల్డ్ కప్ చాన్సులు ఇంకా మిగిలే ఉన్నాయి!


సూపర్ ఫాంలో ఉన్న యువరాజ్ సింగ్ కు వరల్డ్ కప్ బెర్తు దక్కకపోవడం భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. 30 మందితో కూడిన ప్రాబబుల్స్ నుంచి తుది జట్టును ఎంపిక చేయగా, అందులో యువీకి చోటు దక్కలేదు. దీంతో, ఇక యువరాజ్ కు దారులు మూసుకుపోయినట్టే అని అందరూ భావించారు. అయితే, టీమిండియాలో ఇషాంత్ శర్మ, రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా గాయాలతో బాధపడుతుండగా, వారికి ఫిబ్రవరి 7న ఫిట్ నెస్ టెస్టును నిర్వహించనున్నారు. అందులో విఫలమైన ఆటగాళ్లు వరల్డ్ కప్ కు దూరం కాకతప్పదు. ఈ నేపథ్యంలో ఎవరైనా ఫిట్ నెస్ టెస్టు ఫెయిలైతే అతని స్థానంలో యువరాజ్ ఎంపికయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. రంజీల్లో వరుస సెంచరీలతో రాణించడం యువీకి ప్లస్ పాయింట్.

  • Loading...

More Telugu News