: ఇంత రోత పుట్టిస్తారా? 'ఏఐబీ రోస్ట్'పై సెన్సార్ సభ్యుడి ట్వీట్... కరణ్ జోహార్, రణవీర్ సింగ్ లపై కేసు


ఒక చారిటీ సంస్థకు నిధులను సమీకరించే నిమిత్తం ముంబైలో ఏర్పాటు చేసిన కామెడీ ప్రోగ్రామ్ 'ఏఐబీ రోస్ట్'లో నిర్మాత కరణ్ జోహార్, బాలీవుడ్ నటులు రణవీర్ సింగ్, అర్జున్ కపూర్ లు జుగుప్సాకరంగా వ్యాఖ్యలు చేసి రోత పుట్టించారని కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యుడు అశోక్ పండిట్ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించడం పెను దుమారాన్ని రేపింది. ఇదే విషయంలో ముంబైలోని బ్రాహ్మణ ఏక్తా సేవా సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఈ షోపై సామాజిక మాధ్యమాల్లో అనుకూల, వ్యతిరేక చర్చ జోరుగా సాగుతోంది. సెన్సార్ బోర్డు సభ్యుడు అయివుండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, ఆయనను తక్షణం తొలగించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సల్మాన్ సోజ్ వ్యాఖ్యానించారు. అయితే, తన ట్వీట్ కు కట్టుబడి వున్నానని, ఒక బహిరంగ వేదికపై 'హస్త ప్రయోగం' చేసుకుంటే అది కచ్చితంగా అశ్లీల శృంగారమేనని, దాన్ని కుటుంబ సభ్యులతో కలసి చూడగలరా?" అని పండిట్ ప్రశ్నించారు. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం తాము ఏదైనా చర్యలు తీసుకునేముందు ఆ కార్యక్రమాన్ని పరిశీలించాల్సి ఉందని పేర్కొంది.

  • Loading...

More Telugu News