: మహారాష్ట్ర క్రీడాకారుడి కుటుంబానికి పరిహారం ప్రకటించిన ఐఓఏ
కేరళలో జరుగుతున్న జాతీయ క్రీడల్లో హఠాన్మరణం చెందిన మహారాష్ట్ర నెట్ బాల్ క్రీడాకారుడి కుటుంబానికి భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) రూ.2 లక్షలు పరిహారం ప్రకటించింది. మయూరిష్ పవార్ అనే క్రీడాకారుడు కార్డియాక్ అరెస్ట్ తో కుప్పకూలి ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. దీనిపై ఐఓఏ సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా మాట్లాడుతూ, అతని తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలిపారు. మయూరిష్ ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. అతని కుటుంబానికి ఐఓఏ తరపున రూ.2 లక్షలు ఇస్తున్నట్టు పేర్కొన్నారు.