: రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద పోలీసుల కన్నుగప్పి పరారైన చైన్‌ స్నాచర్‌


రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద చైన్‌ స్నాచర్‌ మహ్మద్‌ అఖీలుద్దీన్‌ పోలీసులకు టోకరా ఇచ్చి పరారయ్యాడు. ఓ కేసు విచారణ నిమిత్తం అతడిని కోర్టులో హాజరుపరిచి తిరిగి జైలుకు తరలిస్తుండగా తప్పించుకున్నాడు. గత నెల 18న చైన్‌ స్నాచింగ్‌ కేసులో అఖీలుద్దీన్‌తో పాటు, సయ్యదుద్దీన్‌, మీర్జాస్‌ లను పోలీసులు అదుపులోకి తీసుకుని చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం అఖీలుద్దీన్‌ ను రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరచగా ఈ ఘటన జరిగింది. దీంతో, నిందితుడికి కాపలాగా వచ్చిన పోలీసులు చైతన్యపురి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అఖీలుద్దీన్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News