: స్లొవేనియాలోనూ మహాత్ముడికి విగ్రహం!


ఎక్కడో యూరప్ లోని చిన్న దేశం స్లొవేనియాలో మహాత్మా గాంధీని స్మరించుకోవడం భారతీయులుగా మనందరికీ గర్వకారణమే. స్లొవేనియాలోని స్లొవెంజ్ గ్రాడెక్ నగరంలో గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. శాంతికి మరోపేరులా విలసిల్లిన ఆయన 67వ వర్థంతిని పురస్కరించుకుని ఈ స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు మహాత్ముడి విగ్రహం ప్రతిష్టించిన 73 నగరాల్లో స్లొవెంజ్ గ్రాడెక్ కూడా ఒకటిగా నిలిచింది. ఈ విగ్రహాన్ని భారత్ బహుకరించింది. అక్టోబరు 2న జయంతి నాడు, జనవరి 30న వర్థంతి నాడు ఈ చిన్న నగరంలో మహాత్ముడిని స్మరించుకుంటారని భారత ఎంబసీ పేర్కొంది.

  • Loading...

More Telugu News