: దివంగత చక్రి కార్యాలయంపై దుండగుల దాడి
దివంగత సినీ సంగీత దర్శకుడు చక్రికి చెందిన శ్రీనగర్ కాలనీలోని కార్యాలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసినట్లు ఆయన సోదరుడు మహిత్ నారాయణ నేడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతరాత్రి ఆఫీస్ పై దాడి చేసిన దుండగులు అక్కడి ఫర్నిచర్ ను తగులబెట్టారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు, చక్రి భార్య శ్రావణి కూడా నేటి ఉదయం పోలీస్ స్టేషనుకు వచ్చారు. ఆమె కూడా ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్లు సమాచారం.