: మాస్టర్ ప్లాన్ ఎంతవరకొచ్చింది?: సింగపూర్ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో సింగపూర్ ప్రతినిధుల బృందం భేటీ అయ్యింది. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ రూపకల్పనను ఏపీ సర్కారు సింగపూర్ కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సింగపూర్ ప్రతినిధి బృందం పలుమార్లు తుళ్లూరు పరిధిలో పర్యటనలు జరిపింది. కొద్దిసేపటి క్రితం సీఎం చంద్రబాబునాయుడిని సింగపూర్ ప్రతినిధి బృందం సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా మాస్టర్ ప్లాన్, రాజధాని నిర్మాణంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు వారితో చర్చించినట్టు సమాచారం.